AG 101 యెహోవాను గానము
Versi Version 1
యెహోవాను గానము
చేసెదము ఏకముగా
మనకు రక్షకుడాయెను
ఆయన మహిమ పాడెదము
ఆయనను వర్ణించెదము
ఆయనే దేవుడు మనకు
1
యుద్ధశూరు డెహోవా
నా బలము నా గానము
నా పితరుల దేవుడు
ఆయన పేరు యెహోవా ||యెహోవా||
2
ఫరో రథముల సేనలను
తన శ్రేష్ఠాధి పతులను
ఎఱ్ఱసముద్రములోన
ముంచివేసె నెహోవా ||యెహోవా||
3
నీ మహిమాతిశయమున
కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు
నీపై లేచువారిని ||యెహోవా||
4
దోపుడు సొమ్ము పంచుకొని
ఆశ తీర్చుకొందును
నా కత్తి దూసెదను
అని శత్రువనుకొనెను ||యెహోవా||
5
వేల్పులలో నీ సముడెవడు
పరిశుద్ధ మహనీయుడా
అద్భుతమైన పూజ్యుండా
నీ వంటి వాడెవడు? ||యెహోవా||
6
ఇశ్రాయేలీయులంతా
ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యను
ఆరిన నేలను నడిచిరి ||యెహోవా||

Share

OK