AG 102 కొండల తట్టు - కన్నులెత్తుచున్నాను
Versi Version 1
కొండల తట్టు - కన్నులెత్తుచున్నాను
నాకు సహాయ - మెక్కడ నుండి వచ్చును
1
భూమి ఆకాశములను - సృజించిన
యెహోవా వలన - సాయము కల్గున్‌ ||కొండ||
2
నీ పాదము తొట్రిల్ల - నీయడు
నిన్ను కాపాడువాడు-కునుకడు ||కొండ||
3
ఇశ్రాయేలును కాచు - దేవుడు
కునుకడు నిద్రపోడు-యెన్నడు ||కొండ||
4
యెహోవాయే నిన్ను - కాపాడును
నీ కుడి ప్రక్క నీడగా - నుండున్‌ ||కొండ||
5
పగటెండ - రాత్రి వెన్నెల - దెబ్బ
నీకు తగులకుండ నిను-గాపాడున్‌ ||కొండ||
6
ఎట్టి అపాయము రా - కుండగను
ఆయన నీ ప్రాణమును - గాపాడున్‌||కొండ||
7
ఇది మొదలుకొని నిత్యము నీ
రాకపోకలందు నిను-గాపాడున్‌ ||కొండ||

Share

OK