AG 107 1. సర్వచిత్తంబు నీదేనయ్యా
Versi Version 1
1
సర్వచిత్తంబు నీదేనయ్యా
స్వరూపమిచ్చు కుమ్మరివే
సారెపై నున్న మంటినయ్యా
సరియైన పాత్రన్‌చేయుమయ్యా
సర్వేశ్వరా నేరిక్తుండను
సర్వదా నిన్నే సేవింతును ||సర్వ||
2
ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే
ప్రార్థించుచుంటి నీ సన్నిధి
పరికింపు నన్నీదివసంబున
పరిశుభ్రమైన హిమముకన్న
పరిశుద్ధున్‌ చేసి పాలింపుమా
పాపంబుబోవ నను గడుగుమా ||సర్వ||
3
నీ చిత్తమే సిద్ధించు ప్రభూ
నిన్నే ప్రార్థింతు నా రక్షకా
నీచమౌ గాయముల చేతను
నిత్యంబు కృంగి అలసియుండ
నిజమైన సర్వశక్తుండవే
నీ చేత బట్టినన్‌ రక్షింపుమా ||సర్వ||
4
ఆత్మస్వరూప నీ చిత్తమే
అనిశంబు చెల్లు ఇహపరమున
అధికంబుగా నన్నీ యాత్మతో
ఆవరింపుమో నా రక్షకా
అందరు నాలో క్రీస్తుని జూడ
ఆత్మతో నన్ను నింపుముదేవా ||సర్వ||

Share

OK