AG 11 స్తోత్రింతుము నిను-మాదు తండ్రీ
Versi Version 1
స్తోత్రింతుము నిను-మాదు తండ్రీ
సత్యముతో నాత్మతో నెపుడు
పరిశుద్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం ||స్తో||
1
ధవళ వర్ణుడ - రత్న వర్ణుడ
సత్యరూపి యనబడువాడ
నను రక్షించిన రక్షకుండ
నాథ నీకె శరణం శరణం ||స్తో||
2
శ్రేష్టయీవుల నిచ్చినందున
శ్రేష్ట యీవుల ఊట నీవె
త్రిత్వమై యేకత్వమైన త్రి
యేకదేవా శరణం శరణం ||స్తో||
3
పాపి మిత్రుడ పాప నాశుడ
పరమ వాసుడ ప్రేమ పూర్ణుడ
వ్యోమపీఠుడ స్వర్గ పూజ్యుడ
పరిశుద్ధాంగుడ శరణం శరణం ||స్తో||
4
సంఘమునకు శిరస్సు నీవె
రాజ నీకె నమస్కారములు
ముఖ్యముగను మూలరాయి
కోట్ల కొలది శరణం శరణం ||స్తో||
5
నీదు సేవకుల పునాదిది
జ్ఞానమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు
వేడెదము శరణం శరణం ||స్తో||
6
రాజ నీకె స్తుతి స్తోత్రములు
గీతముల మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యము
హల్లెలూయ ఆమెన్‌ ఆమెన్‌ ||స్తో||

OK