AG 114 దేవా - నా దేవుడవు నీవె
Versi Version 1
దేవా - నా దేవుడవు నీవె
వేకువనే - వెదకెద నిన్ను
1
నీ బలము ప్రభావములను
చూడవలెనని యాశతోడ
పరిశుద్ధాలయ మందు
నీ తట్టు కనిపెట్టుదును ||దేవా||
2
నీళ్ళులేక ఎండియున్న
దేశమందు నా ప్రాణము
నీ కొరకు దాహమొంది
దేహము కృశించుచున్నది ||దేవా||
3
నీ కృప జీవము కన్న ఉత్తమము
నా పెదవులు నిన్ను స్తుతించున్‌
జీవితకాలమెల్ల స్తుతింతు నీ
నామమును బట్టి చేతులెత్తెదన్‌ ||దేవా||
4
రాత్రి జాములందు నిన్ను ధ్యానించు
తరుణమున క్రొవ్వు మెదడు
దొరికినట్లుగా నా ప్రాణము
తృప్తినొందుచున్నది ||దేవా||
5
ఉత్సహించెడు పెదవులతో నా
నోరు నిన్ను గూర్చి గానము
చేయుచున్నది నా సహాయ కుడా
నీ రెక్కల చాటున ||దేవా||

OK