AG 124 దేవుని యందు - నిరీక్షణ నుంచి
Versi Version 1
దేవుని యందు - నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నాప్రాణమా!
1
ఏ అపాయము - రాకుండ నిన్ను
దివారాత్రులు - కాపాడువాడు
ప్రతిక్షణం - నీ పక్షముండు
రక్షకుడు ||దేవుని||
2
చీకటిని - వెలుగుగ చేసి
ఆయన నీ - ముందు పోవువాడు
సత్యమగు జీవమగు
మార్గము యేసే ||దేవుని||
3
నీకు సహాయముచేయువాడు
సదా ఆదుకొను -వాడు ఆయనే
ఆధారము - ఆదరణ
ఆయనలో ||దేవుని||
4
తల్లితన బిడ్డను - మరచినను
మరువడు నీ - దేవుడు నిన్ను
తల్లికన్న - తండ్రికన్న
ఉత్తముడు ||దేవుని||
5
నీకు విరోధముగా - రూపించిన
ఏవిధ ఆయుధమును - వర్ధిల్లదు
శత్రువులు మిత్రులుగ
మారుదురు ||దేవుని||
6
పర్వతములు తొలగి - పోయినను
తన కృప నిన్ను - ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు
నీ దేవుడు ||దేవుని||
7
స్తుతి మహిమలు - నీకే ప్రభు
నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ ||దేవుని||

Share

OK