AG 132 స్తోత్రమే మా ప్రాణము
Versi Version 1
స్తోత్రమే మా ప్రాణము
స్తుతులె మా ఆహారము
సిలువయే మా ధ్యానము
ప్రభు పొలములో పనివారము ||స్తో||
1
యేసు క్రీస్తే మార్గము
ప్రభు యేసు క్రీస్తే గమ్యము
కొండమీది ప్రసంగము
మా జీవితమునకు గమ్యము ||స్తో||
2
సిలువ వేదం చదువుకుంటు
ప్రభు శ్రమల పల్లకి మోసికుంటూ
అనుదినము స్తోత్రించుకుంటూ
చేరెదం ప్రభు రాజ్యము ||స్తో||
3
హల్లెలూయ పాడెదం
ప్రభు అద్భుతాలను చాటెదం
కోటి కాంతుల వెలుగుమయుని
కరుణపీఠం చేరెదం ||స్తో||

OK