AG 133 నీతిగల యెహోవ స్తుతి మీ
Versi Version 1
నీతిగల యెహోవ స్తుతి మీ
యాత్మతో నర్పించుడీ
యాత్మతో సేవించుడీ
దాతయౌ మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడీ
1
చదలబుడమిని రవిని జలధిని
నదులగిరులను జక్కగా
సదమలంబగుదైవ నామము
సర్వదా నుతిచేయనీ ||నీతి||
2
సర్వశక్తుని కార్యములకీ
సర్వ రాష్ట్రములన్నియు
గర్వముల్‌ విడితలలు వంచుచు
నుర్విలో నుతిజేయనీ ||నీతి||
3
గీత తాండవ వాద్యములచే
బ్రీతిపరచెడు సేవతో
బాతకంబులు పరిహరించెడు
దాతనే సేవించుడీ ||నీతి||
4
పరమ దూతలు నరులు పుడమిని
మొరలుబెట్టుచు దేవుని
బరమునందున్నట్టి యేసుని
పాదములు సేవింపనీ ||నీతి||
5
ఇలను భక్తులు గూడుకొనుచును
బలము గల్గిన దేవుని వెలయు
స్తుతులను నోళ్ళతోడను
విసుకకుండగ జేయనీ ||నీతి||

OK