AG 137 స్తుతి సింహాసనాశీనుడా
Versi Version 1
స్తుతి సింహాసనాశీనుడా
యేసురాజా దివ్య తేజా
1
అద్వితీయుడవు పరిశుద్ధుడవు
అతి సుందరుడవు నీవే ప్రభూ
నీతి న్యాయములు నీ సింహాసనాధారం
కృప సత్యము
నీ సన్నిధాన వర్తులు ||స్తు||
2
బలియు అర్పణ కోరవు నీవు
బలియైతివి నా దోషము కొరకై
నా హృదయమె నీ ప్రియమగు
ఆలయం - స్తుతి యాగమునే
చేసెద నిరతం ||స్తు||
3
బూర ధ్వనులే నింగిని మ్రోగగ
రాజాధిరాజా నీవే వచ్చు వేళ
సంసిద్ధతతో - వెలిగే సిద్దెతో
పెండ్లి కుమారుడా
నిన్నెదుర్కొందును ||స్తు||

OK