AG 143 దేవ సంస్తుతి చేయవే మనసా
Versi Version 1
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు
యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా
నా జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా
నా యంతరంగములో
వశించునో సమస్తమా ||దేవ||
1
జీవమా, యెహోవా నీకు
జేసిన మేళ్లన్‌ మరువకు
నీవు చేసిన పాతకంబులను
మన్నించి జబ్బు
లేవియున్‌ లేకుండ జేయును
ఆ కారణముచే ||దేవ||
2
చావు గోతి నుండి నిన్ను
లేవనెత్తి దయను గృపను
జీవ కిరీటముగ వేయును
నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును
ఆ కారణముచే ||దేవ||
3
యౌవనంబు పక్షిరాజు
యౌవనంబు వలెనె క్రొత్త
యౌవనంబై వెలయునట్లుగ
మేలిచ్చి నీదు
భావమును సంతుష్టి పరచునుగా
ఆ కారణముచే ||దేవ||
4
ప్రభువు నీతి పనులు చేయున్‌
బాధితులకు న్యాయ మిచ్చున్‌
విభుడు మార్గము తెలిపె మోషేకు
దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు
ఆ కారణముచే ||దేవ||
5
అత్యధిక ప్రేమ స్వరూపి
యైన దీర్ఘ శాంతపరుడు
నిత్యము వ్యాజ్యంబు చేయడు
ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోపముంచడు
ఆ కారణముచే ||దేవ||
6
పామరుల మని ప్రత్యుపకార
ప్రతి ఫలంబుల్‌ పంపలేదు
భూమికన్న నాకసంబున్న
యెత్తుండు దైవ
ప్రేమ భక్తి జనుల యందున
ఆ కారణముచే ||దేవ||
7
పడమటికి తూర్పెంత యెడమో
పాపములకును మనకు నంత
యెడము కలుగ జేసియున్నాడు
మన పాపములను
యెడముగానే చేసియున్నాడు
ఆ కారణముచే ||దేవ||
8
కొడుకులపై దండ్రి జాలి
పడు విధముగా భక్తిపరుల
యెడల జాలి పడును దేవుండు
తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు
ఆ కారణముచే ||దేవ||
9
మనము నిర్మితమయిన రీతి
తనకు దెలిసియున్న సంగతి
మనము మంటివార మంచును
జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును
ఆ కారణముచే ||దేవ||
Versi Version 2
1
పూసి గాలి వీవ నెగిరి
పోయి బసను దెలియని వన
వాస పుష్పము వలెనె నరుడుండు
నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు
ఆ కారణముచే ||దేవ||
Versi Version 3
1
పరమ దేవ నిబంధ నాజ్ఞల్‌
భక్తితో గైకొను జనులకు
నిరతమును గృప నిలిచి యుండును
యెహోవా నీతి
తరముల పిల్లలకు నుండును
ఆ కారణముచే ||దేవ||

Share

OK