AG 145 రాజులకు రాజైన యీ మన విభుని
Versi Version 1
రాజులకు రాజైన యీ మన విభుని
పూజసేయుటకు రండి
యీ జయశాలి కన్న-మన కింక
రాజెవ్వరును లేరని ||రాజులకు||
1
కరుణ గల సోదరుండై-యీయన
ధరణి కేతెంచె నయ్యా
తిరముగ నమ్ముకొనిన-మనకొసగు
బరలోక రాజ్యమ్మును ||రాజులకు||
2
నక్కలకు బొరియలుండె-నాకాశ
పక్షులకు గూళ్లుండెను
ఒక్కింత స్థలమైనను-మన విభుని
కెక్కడ లేకుండెను ||రాజులకు||
3
అపహాసములు సేయుచు-నాయన
యాననము పై నుమియుచు
గృప మాలిన సైనికు-లందరును
నెపములెంచుచు గొట్టిరి ||రాజులకు||
4
కరమునందొక్క రెల్లు-పుడకను
దిరముగా నునిచి వారల్‌
ధరణీపతి శ్రేష్ఠుడా-నీకిపుడు
దండమనుచును మ్రొక్కిరి ||రాజులకు||
5
ఇట్టి శ్రమలను బొందిన-రక్షకుని
బట్టుదలతో నమ్మిన
అట్టహాసము తోడను-బరలోక
పట్టణంబున జేర్చును ||రాజులకు||
6
శక్తి గల రక్షకుండై-మన కొరకు
ముక్తి సిద్ధము జేసెను
భక్తితో బ్రార్థించిన-మన కొసగు
రక్తితో నా ముక్తిని ||రాజులకు||
7
త్వరపడి రండి రండి-యీ పరమ
గురుని యొద్దకు మీరలు
దరికి జేరిన వారిని-యీ ప్రభువు
దరుమడెన్నడు దూరము ||రాజులకు||

Share

OK