AG 147 నీతో సమమెవరు?
Versi Version 1
నీతో సమమెవరు?
నీలా ప్రేమించేదెవరు?
నీలా క్షమియించేదెవరు యేసయ్యా?
నీలా పాపికై ప్రాణంబెట్టిన వారెవరు?
1
లోక బంగారము-ధన ధాన్యాదులు
ఒక్క పోగేసినా-నీతో సరితూగునా?
జీవ నదులన్నియు, సర్వ సంద్రములు
ఒక్కటై యెగసినా నిన్ను తాకగలవా?
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా
నీవేగా మంచి దేవుడవు ||నీతో||
2
పలు వేదాలలో మతగ్రంథాలలో
పాపమే సోకని పరిశుద్ధుడేడి?
పాప పరిహారార్థం సిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు?
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి?
నీవేగా విమోచకుడవూ ||నీతో||
3
నేను వెదుకకున్నా నాకు దొరికితివి
నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
నీకు గాయాలు చేసి-తరచు రేపితిని
నన్నెంతో సహించి క్షమియించితివి
లోక సౌఖ్యాలన్ని ఒక్క చోట కుమ్మరించినా
నీవెగా చాలిన దేవుడవు ||నీతో||

OK