AG 152 విశ్వాసమే విజయము - విను
Versi Version 1
విశ్వాసమే విజయము - విను
ప్రియుడా య-విశ్వాస మపజయము
విశ్వాసాయుతమైన - విసుకని
సుకార్యములే - విశ్వాసవంతునికి
విజయ మొసగును నిజము ||విశ్వా||
1
భక్తుడందువలననే - బ్రతుకును
మరియు - శక్తినొంది నిల్చును
యుక్తముగ వర్తించి - యుర్విని
జయించి - ముక్తి నొందున టంచు
రక్తిగా బాడుదును ||విశ్వా||
2
మంచి పేరు నొందును - సాతాను
నెదిరించి విజయ మొందును
మించిన బాధల్స-హించి జయించును
సంచిత మరణము - నానందముగ
గాంచు ||విశ్వా||
3
ప్రవిమల మొందెదము - పాపము
నుండి - పరిహరింపబడుదుము
అవి రతమును మనము
నాశ్చర్యముగ ఘనము
భువియందున్‌ దివియందున్‌
బుధులతో నొందుదుము ||విశ్వా||
4
నీతిమంతుల మౌదుము
నిశ్చయము ప్ర-ఖ్యాతి బోధను నేర్తుము
ఆ తండ్రి దత్తముల-నన్ని యార్జించు
యాతని సుభద్రములో -ననయ
ముందుము నిజము ||విశ్వా||
5
పరిపూర్ణ విశ్వాసమే - క్రియలతో నున్న
మరి మంచి విశ్వాసమే
ధరయందున్‌ బరమందున్‌
ధన్యాత్మునిగ జేయున్‌ - సరగు
నద్దానినే - సంపాదించుము
ప్రియుడా ||విశ్వా||

Share

OK