AG 154 యేసువంటి ప్రియబంధుడు నాకిక
Versi Version 1
యేసువంటి ప్రియబంధుడు నాకిక
నిహ పరములలో లేడన్న
భాసురముగ నిజ భక్తుల కదియను
భవ గోచర మెపుడగు నన్న
1
ఊరు పేరు పరువులు మురువులు
మరి -యూడగొట్టబడినను గాని
కూరిమితో క్రీస్తుడు మాకుండిన
కొదువరాదు గొప్పయు పోదు ||యేసు||
2
ఆడికలు తిరస్కారంబులు
మా-కవమానములున్నన్‌ గాని
తోడు క్రీస్తుడు మాకుండినను త్రోవ
దప్పము ఓడిపోము ||యేసు||
3
తగ్గుపాటులును సిగ్గుపాటులును
దలమీదను వ్రాలినగాని - దగ్గర మా
పాలిట ప్రభువుండగ - సిగ్గును
బొందము తగ్గున గుందము ||యేసు||
4
ఎన్నెన్నో శోధనల బాధలు చెల-రేగి
మనల జుట్టిన యపుడు - కన్న
తండ్రివలె నోదార్చును దన - ఘన
వాగ్బలమున దునుమును వానిని ||యేసు||
5
మనసు క్రుంగి పలు చింతలచేత
మట్టబడిన వేళను మాకు తన
వాగ్దత్తములను జేతుల లే - వనెత్తి
యెంతో సంతసమొసగును ||యేసు||
6
తల్లిదండ్రులు విడిచిన గాని
తాను వదలడెప్పుడు మమ్ము
ఉల్లమునెత్తి పిలిచిన వేళ
నోహోయనుచు దరికి వచ్చు ||యేసు||
7
అతడుండని పరమండలము ఇక
వెదకినగాని యగపడదు
క్షితినాతడు మామతిని వసించిన
అతులిత సౌఖ్యం బదియే మోక్షము||యేసు||

OK