AG 156 క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి
Versi Version 1
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి
1
ముక్తి విధాత నేత - శక్తినొసంగు దాత
భక్తివిలాప శ్రోత - పరమంబు
వీడె గాన ||క్రీస్తే||
2
దివ్యపథంబురోసి - దైవంబుతోడు
బాసి దాసుని రూపుదాల్చి
ధరణికేతెంచెగాన ||క్రీస్తే||
3
శాశ్వత లోకవాసి - సత్యామృతంపు
రాశి శాప భారంబు మోసి
శ్రమల సహించెగాన ||క్రీస్తే||
4
సైతాను జనము గూల్పన్‌
పాతాళమునకు బంపన్‌
నీతి పథంబు బెంప
రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే||
5
మృత్యువు ముల్లు తృంపన్‌
నిత్యజీవంబు బెంపన్‌
మార్త్యాళిభయము దీర్పన్‌
మరణంబు గెలిచెగాన ||క్రీస్తే||
6
పరమందు దివిజులైన - ధరయందు
మనుజులైన ప్రతి నాలుక మోకాలు
ప్రభునే భజించుగాన ||క్రీస్తే||
7
ఈ నామమునకు మించు
నామంబులేదటంచు
యెహోవ తండ్రి యేసున్‌
హెచ్చించినాడు గాన ||క్రీస్తే||

OK