AG 162 బహుగా ప్రార్థన చేయుడి
Versi Version 1
బహుగా ప్రార్థన చేయుడి
ఇకమీదట బహుగా ప్రార్థనచేయుడి
బహుగా ప్రార్థన చేసి-బలమున్‌
సంపాదించి - మహిలో కీడును
గెల్వుడి-దేవుని కెపుడు-మహిమ
కలుగనీయుడి
1
చెడుగెక్కువగుచున్నది-భూలోకమున
చెడుగెక్కువగుచున్నది
చెడుగుపై మంచిపై-చేయగలదౌనట్లు
విడువక ప్రార్థించుడి-మీ ప్రార్థన
కడవరకు బోనీయుడి ||బహుగా||
2
వాగ్దానములు చూడుడి-దేవుని గ్రంథ
వాగ్దానములు జూడుడి
వాగ్దానముల్‌ జరుగ వలసిన
కార్యంబుల్‌
వాగ్దానములు నమ్ముడి ఈ రీతిగా
ప్రభుని సన్మానించుడి ||బహుగా||
3
విందు నన్న దేవుని-వాగ్దానము
విందుగా ధ్యానించుడి
విందులో నుండగా-వింతగ నెరవేర్పు
బొందియానందింతురు-ఇది రెండవ
విందంచు గ్రహింతురు ||బహుగా||
4
విసుగుదల జెందరాదు-ప్రార్థన
నెరవేర్పు తత్‌క్షణమె రాదు
విసుగున్నచో సిద్ధి-వెనుకకే పోవును
వసియించుడి దేవుని-వాగ్దానమున
భటులవలె నిల్వుడి ||బహుగా||
5
సంశయము పనికిరాదు-లేశంబైన
సంశయము పనికిరాదు
సంశయింపక దైవ సన్నిధియందు మీ
యంశము విడచెప్పుడి-దానికి గొప్ప
యంశం బట్టనీయుడి ||బహుగా||
6
సిద్ధి కనుపింపకున్న-వాగ్దానము
సిద్ధియున్నది చూడుడి-సిద్ధి యప్పుడు
మీకై సిద్ధవై వెడలి ప్ర-సిద్ధిలోనికి
వచ్చును-మీ నమ్మిక వృద్ధిగాంచి
నిల్చును ||బహుగా||
7
సంతోషమందరారె-మన దేవుని
సంస్తుతి చేయరారె-సంతోషబలముచే
సర్వ కష్టములను-అంతరింపజేతుము
మన దేవుని సంతోష
పరచెదము ||బహుగా||
8
అంతయు మనదేగదా-యేసుని
కున్నదంతయు మనదె గదా
అంతయు మన ప్రభువు
ఆర్జించియున్నాడు-స్వంతమని
అందుకొనుడి-మీ ఆత్మకు శాంతి
జెందనీయుడి ||బహుగా||
9
విజయ జీవనము మనదె-క్రీస్తిచ్చిన
విజయ జీవనము మనదె విజయ
జీవనము మనదె విశ్వమంతయు
మనదె-భజన సంఘంబు మనదె
దేవుడున్న పరలోకమెల్ల
మనదె ||బహుగా||

OK