AG 165 నీవు తోడైయున్న జాలు-యేసు
Versi Version 1
నీవు తోడైయున్న జాలు-యేసు
నిత్యము నా కదిమేలు-నీవు
ధరణినుండు-నీచ పాపులనెల్లఁ
గావబ్రేమ వచ్చి-ఘన ప్రాణమిడినట్టి
1
నిను బోలు రక్షకుండేడి-క్రీస్తు
నను బోలు పాతకుండేడి-నిను నమ్ము
వారలకు నీ వొసగుచుందువు-తనర
పాపక్షమ- దయచేత నిలలోన ||నీ||
2
నీ పాటి బలవంతుడేడి-ప్రభు
నాపాటి దుర్భలుండేడి-కాపాడుచుందువు
కల కాలమును నీవు
నీ పాద సేవకుల-నీ
నేర్పు రంజిల్ల ||నీ||
3
నీ వంటి యుపకారి యేడి-కర్త
నావంటి కడు దీనుడేడి-జీవులకును
గల్గు-జీవంబులిచ్చుచు జీవాధారములొసగి
జీవుల బ్రోచెడి ||నీ||
4
నీవంటి ధనవంతుడేడి-యేసు
నావంటి ధనహీనుడేడి-ప్రోవులైయున్నవి
యీవులు నీ యందు నీవు వాని
నొసంగి నిరతంబునను గావు ||నీ||

OK