AG 166 నిన్ను నేను విడువను దేవ
Versi Version 1
నిన్ను నేను విడువను దేవ
నీవు నను దీవించు వరకు
నిన్ను నమ్మిన వారలనెల్ల
నీవు చక్కగ దీవించెదవు ||నిన్ను||
1
నేను శత్రువునైయుండగ
నీవు నాపై నెనరు జూపి
దానమిచ్చితివి నా కొరకు
దారుడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను||
2
త్రోవదప్పి తిరుగుచుండ
దుడుకునైన నన్ను గాంచి
ప్రోవగోరి మదిని నీవు
త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను||
3
నాట నుండి నేటి వరకు
నాకు గల్గిన శోధనములలో
నేటుగా నను గాచినవాడవు
నీవుగావా, ఓ నా తండ్రి ||నిన్ను||
4
ఇంతకాలము నన్నుగాచి
యికను నన్ను విడువ వనుచు
సంతసించి మదిని నేను
జక్కగ నీదరి జేరితిని ||నిన్ను||
5
నీవుగాక యెవరున్నారు
నేలపైని నను గాపాడ
చేవలేని నాకు నీవు
చేవ గలుగజేయగలవు ||నిన్ను||
6
అడుగువారి కిచ్చెద నంచు
నానతిచ్చినావు గాన
నడిగెద నిను సహాయ్యంబు
నాత్మవై యున్నట్టి తండ్రి ||నిన్ను||
7
నాదు ప్రార్థన లన్నియు నీవు
నీదు కృపచే నాలకించి
నీదు సరణిని నిల్పి నన్ను
నేర్పుదనరగ రక్షించితివి ||నిన్ను||

OK