AG 168 నా ప్రియ యేసు రాజా
Versi Version 1
నా ప్రియ యేసు రాజా
ఆదుకొ నన్నెపుడు
శోధనలో వేదనలో
నినువీడి పోనీయకు ||నా ప్రియ||
1
కలుషితమగు ఈ లోకం
కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే
మెదిలెను నా హృదయములో
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||
2
మరచితి నీ వాగ్దానం
సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే
వడిగా నను పెనుగొనగా
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||
3
నేరములెన్నో నాపై
మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో
దూరముగా పరుగిడితి
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||
4
చాలిన నిన్ను విడచి
కోరితి దీవెనలెన్నో
భావనలేమో అరసి
వదలితి వాక్యాధారం
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||
5
నీ కృపలను నే మరచి
కృతజ్ఞత వీడితి ప్రభువా
హృదయము కఠినమై పోయె
కరిగించి దీవించు ప్రభువా
కల్వరిలో ఆదరించు
ఆదరించు ఆదరించు ||నా ప్రియ||

OK