AG 17 లెక్కింపలేని స్తోత్రముల్‌ - దేవా
Versi Version 1
లెక్కింపలేని స్తోత్రముల్‌ - దేవా
ఎల్లప్పుడు నే పాడెదన్‌
ఇంతవరకు నా బ్రతుకులో - నీవు
చేసిన మేళ్ళకై (2) ||లె||
1
ఆకాశ మహాకాశముల్‌ - దాని
యందున్న సర్వంబును
భూమిలో కనబడు వన్నీ - ప్రభువా
నిన్నే కీర్తించును ||లె||
2
అడవిలో నివసించుచున్నవన్నీ -
సుడిగాలియు మంచును
భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే
పొగడును ||లె||
3
నీటిలో నివసించు ప్రాణుల్‌ - ఈ
భువిలోని జీవరాసులు
ఆకాశమున ఎగురున వన్నీ -
ప్రభువా నిన్నే కీర్తించున్‌ ||లె||

OK