AG 171 నడిపించు నా నావ
Versi Version 1
నడిపించు నా నావ
నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున
నా జన్మ తరియింప ||నడి||
1
నా జీవిత తీరమున
నా యపజయ భారమున
నలిగిన నా హృదయమును
నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ
నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము
నా సేవ జేకొనుము ||నడి||
2
రాత్రంతయు శ్రమపడిన
రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను
రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ
రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో
రాజిల్లు నాపడవ ||నడి||
3
ఆత్మార్పణ చేయకయే
ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే
అరసితి ప్రభు నీ కలిమి
ఆశానిరాశాయే - ఆవేద నెదురాయె
ఆధ్యాత్మిక లేమి గని
అల్లాడె నా వలలు ||నడి||
4
ప్రభు మార్గము విడచితిని
ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని
పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో
ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు
పాటింతు నీ మాట ||నడి||
5
లోతైన జలములలో
లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి
లోపంబులు సవరించి
లోనున్న ఈ-వులలో
లోతైన నాబ్రతుకు
లోపింపని యర్పణగా
లోకేశ జేయుమయా ||నడి||
6
ప్రభుయేసుని శిష్యు డనై
ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో
పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు
పానార్పణము జేతు ||నడి||

OK