AG 176 ఎంతజాలి-యేసువా
Versi Version 1
ఎంతజాలి-యేసువా
యింతయని-యూహించలేను
1
హానికరుడ హింసకుడను
దేవ దూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను
ఆదరించి నావుగా ||ఎంత||
2
రక్షకుండా నాకు బదులు
శిక్షననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి
చావొందితివి నాకై ||ఎంత||
3
ఏమి నీకర్పించగలను
ఏమిలేని వాడనయ్య
రక్షణంపు పాత్ర నెత్తి
స్తోత్రమంచు పాడెదా ||ఎంత||
4
నీదు నామమునకు యిలలో
భయపడు వారి కొరకై
నాథుడా నీవిచ్చు మేలు
ఎంత గొప్ప దేసువా ||ఎంత||
5
నేను బ్రతుకు దినములన్ని
క్షేమమెల్ల వేళలందు
నిశ్చయముగ నీవు నాకు
యిచ్చువాడా ప్రభువా ||ఎంత||
6
నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చువాడా నీవు
నాదు కాపరివి నీవు
నాకు లేమి లేదుగా ||ఎంత||
7
అందరిలో అతి శ్రేష్టుండా
అద్వితీయుడగు యేసయ్య
హల్లెలూయా స్తోత్రములను
హర్షముతో పాడెదా ||ఎంత||

OK