AG 181 నన్ను దిద్దుము చిన్న ప్రాయము
Versi Version 1
నన్ను దిద్దుము చిన్న ప్రాయము
సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను
నిన్ను జేరితి నాయనా ||నన్ను||
1
దూరమునకు బోయి నీదరి
జేరనైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా-రడవి
దిరిగితి నాయనా ||నన్ను||
2
మంచి మార్గము లేదు నాలో
మరణ పాత్రుడ నాయనా
నేను వంచితుండనైతిని ప్ర-పంచ
మందున నాయనా ||నన్ను||
3
చాలా మారులు తప్పిపోతిని
మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము
జాలి గల నా నాయనా ||నన్ను||
4
జ్ఞాన మంతయు బాడు జేసి
కాననైతిని నాయనా
నీవు జ్ఞానము గల తండ్రి వంచు
జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||
5
కొద్ది నరుఁడను దిద్దినను నీ
యొద్ద చేర్చుము నాయనా
నీ యొద్ద జేర్చి బుద్ధి జెప్పుము
మొద్దు నైతిని నాయనా ||నన్ను||
6
ఎక్కడను నీ వంటి మార్గము
నెరుగనైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి
చక్కపరచుము నాయనా ||నన్ను||
7
శత్రువగు సాతాను నన్ను
మిత్రు జేయను నాయనా
ఎన్నో సూత్రములు గల్పించెను నా
నేత్రములకో నాయనా ||నన్ను||
8
వాసిగా నేఁ బాపలోకపు
వాసుడనో నాయనా
నీ దాసులలో నొకనిగా ననుఁ జేసి
కావుము నాయనా ||నన్ను||

OK