AG 189 యేసుక్రీస్తు నిన్ను-పిలిచెనుగా
Versi Version 1
యేసుక్రీస్తు నిన్ను-పిలిచెనుగా
రావేల ఓ యువకా... రావేల ఓ యువతీ
నీ హృదయము ప్రభుకిమ్ము
ప్రభు జీవము నీదగును
1
గురిలేని నీ బ్రతుకు
ఎరయాయెను విరోధికి
త్వరపడకుంటే నీకు
మరి తప్పదు నరకాగ్ని ||నీ హృ||
2
నీ దేహము దేవునిది
శుద్ధాత్మకు నిలయమది
ప్రభు కర్పణ చేయనిదే
పడగొట్టును అపవాది ||నీ హృ||
3
ప్రభు వనమున పనిచేయ
పనివారలు కావలెను
వినలేవా ప్రభు స్వరము
కనలేవా ప్రభు పొలము ||నీ హృ||
4
దుర్దినములు రాకముందే
స్మరియించుము రక్షకుని
ఘనమైన రక్షణను
నిర్లక్ష్యము చేయుదువా ||నీ హృ||
5
నీ యౌవన కాలమున
ప్రభుకాడిని మోయవలెన్‌
మేలొందెద వీనాడే
జాగేలను యువజనమా ||నీ హృ||

Share

OK