AG 195 ప్రభువా నే నిన్ను నమ్మి
Versi Version 1
ప్రభువా నే నిన్ను నమ్మి
నిన్నాశ్రయించినాను
నరులేమి చేయగలరు
భయమేమి లేదు నాకు
1
గర్విష్టులైన వారు
నాతో పోరాడుచుండ
ప్రతిమాట కెల్లవారు
పరభావ మెంచుచుండ
ప్రభువా నా ప్రక్కనుండి
నన్ను తప్పించినావు ||ప్రభువా||
2
నే నెందు బోదునన్న
గమనించుచుండ వారు
నా వెంట పొంచి యుండి
నన్ను కృంగ నెంచ
ప్రభువా నా ప్రక్క నుండి
నన్ను తప్పించినావు ||ప్రభువా||
3
పగబూని వారు నన్ను
హతమార్పజూచియున్న
మరణంబు నుండి నన్ను
కడువింత రీతిగాను
ప్రభువా నా ప్రక్కనుండి
నన్ను తప్పించినావు ||ప్రభువా||
4
జీవంబు వెల్గువైన
నీ సన్నిధానమందు
నే సంచరించునట్లు
నే జారిపోవకుండ
ప్రభువా నా ప్రక్కనుండి
నన్ను తప్పించినావు ||ప్రభువా||
5
నన్నాదుకొంటి వీవు
నన్నాదరించినావు
కొన్నావు నీవు నన్ను
మన్నించినావు నీవు
ఎన్నాళ్ళు బ్రతికియున్న
నిన్నే సేవింతు దేవ ||ప్రభువా||

OK