AG 21 సుందర పరమదేవ కుమారుడైన
Versi Version 1
సుందర పరమదేవ కుమారుడైన
యేసుక్రీస్తున్‌
స్తోత్రించి పొగడి నిత్యం కొనియాడెదం
అందలం భువికి తెచ్చి
ప్రాణమును ధారబోసెను
ఆదరించి మమ్ములను ఐక్యపర్చెన్‌
ఆత్మను కుమ్మరించెన్‌
కృపలతో నాదరించెన్‌-స్తుతి ||స్తు||
1
పాపకూపమున పడి
పాప శాపము నొందిన
పాపులను రక్షింపను ప్రాణమిచ్చెను
దేవుని కిష్టులైన ప్రజలుగ మార్చిన
మెస్సయ్యాను విశ్వసించు భక్తులార
నీతిపరుడైన న్యాయాధిపతి
పాదముల చేరుడి, పశ్చాత్తాపమొందుడి
జయోత్సవం చేయుడి
స్తుతి చెప్పి పాడుడి-పాడుడియంచు ||స్తు||
2
ఆకాశపు జ్యోతులన్ని
లెక్కలేని దూతసైన్యం
అద్భుతముగ క్రీస్తును ఆరాధించిరి
మంటిలోని జాతులన్ని
శ్రేష్టమైన వస్తువులన్ని
శక్తిమంతుడని స్తుతి పాడి పొగడిరి
అందరికి తండ్రి యొకే
పావన కుమారుని కీర్తించను
పాదములు మ్రొక్కను
అనేకులు చేరను - స్తుతి గీతి
పాడుడి - పాడుడి యంచు ||స్తు||
3
రాజులు జ్ఞానులు మేధావులు
యందరును
కలసి కృపతో జీవించుచుండగాను
ఏ ప్రాంతభక్తులైన
విశ్వాసులందరును
సమాధానంతో జీవించుచుండగా
సద్బోధకులు సత్యసంఘములు
లేచి జీవించిన
సైతాన్‌ పారిపోవును
జయం మనది యగును యని
పాడి పాడుడి - పాడుడి యంచు ||స్తు||

OK