AG 218 ప్రేమామృత ధారల చిందిన మన
Versi Version 1
ప్రేమామృత ధారల చిందిన మన
యేసుకు సమమెవరు ఆ...ఆ..ఆ
ప్రేమయె తానై నిలచి
ప్రేమవాక్కులనే బలికి
ప్రేమతో ప్రాణము బెట్టి
ప్రేమ నగరికి చనియే ||ప్రేమ||
1
నిశ్చలమైన ప్రేమజీవికి
ఇలలో తావేది
ప్రేమ ద్రోహులే గాని
ప్రియమున జేరరు వాని
చేరిన చెలికాడగురా
సమయమిదే పరుగిడరా ||ప్రేమ||
2
ఎంత ఘోర పాపాత్ములనైనా
ప్రేమించును రారా
పాపభారముతో రారా
పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు
తప్పక నిన్ను రక్షించున్‌ ||ప్రేమ||
3
ఇంత గొప్ప రక్షణను
నిర్లక్ష్యము చేసెదవేల
రక్షణ దినమిదియేరా
తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము
ముదమారగ చేకొనుము ||ప్రేమ||

OK