AG 223 రమ్మనుచున్నాడేసు రాజు
Versi Version 1
రమ్మనుచున్నాడేసు రాజు
రండి సర్వ జనులారా
1
ఇల్లు వాకిలి లేని వారలు
ఇహాన నమ్మదగని వారలు
తన రాజ్యము మీకిచ్చును యేసు ||ర||
2
కరవుచే కృశించుచున్న
మరణించుచున్న ప్రజలారా
ఆకలి దప్పులు తీర్చును మీకు ||ర||
3
ముండ్ల మకుటము ప్రక్క గాయము
పాద హస్తములలో గాయములు
పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము ||ర||
4
రయమున ప్రియులారా కూడి
రండి పరీక్ష చేయండి
భరియించును మీ భారములన్ని ||ర||

OK