AG 224 జాలమేలా జేసె దరూ
Versi Version 1
జాలమేలా జేసె దరూ
మేలుకొని ప్రభు జేరన్‌
ప్రాలుమాలిన జీవమేల?
కాలయాపనదేలా?
మేలుకొనుడీ మీ మనములన్‌
జాలిగల పిలుపున్‌ మీరల్‌ విని ||జాల||
1
ఎంత కాలము చింతలలో
మునిగి యుండెదరేలా
చెంతజేర రండి నేడే
చింతలన్‌ దీర్చున్‌ ప్రభు వింతగ ||జాల||
2
లోక పుటాశలు జుట్టి మనలన్‌
లోక మునకే జేర్చున్‌
లోకరక్షకుడేసే మనలన్‌
ప్రాకటము బ్రోచున్‌ వాస్తవమిదె ||జాల||
3
సందియంబులు గలిగి నీవు
గుంది యుండెదవేలా
వందితుండౌ యేసు ప్రభు
పాదములను-బ్రతిమాలుము ||జాల||
4
కఠిన హృదయము కరుగదేలా?
కఠిన హృదయమదేలా
కుటిల వర్తనమంత వీడుము
పఠన జేయుచు దైవగ్రంథము ||జాల||
5
మోసబోకుడి దాసజనమా
నాశనమె మన గతియౌ
నీ సురక్షకుడేసు ప్రభువే
యాశ్రయమె సుమ్మాయని నమ్ముము
6
పాప దాస్యమందు జిక్కి
శాపగ్రస్తుడవౌదు
పాపజీవితము మరణమౌగా
కృపయే యేసుని దానము జీవము
7
మారుమనసు నొంద రండి
భారములు కడద్రోసి
నేరమెంచని యేసు కృపను
కోరుకొని జీవింపగ రండి ||జాల||
8
కోరుకొనుడి రక్షణంబును
కోరుకొనుడి నేడే
కోరువారికి జీవజలముల్‌
కోరికలు దీర నిచ్చును ప్రభు ||జాల||

OK