AG 227 పాపిగానే జీవింతువా
Versi Version 1
పాపిగానే జీవింతువా
పాపమునందే మరణింతువా ప్రియుడా
ప్రభుని ప్రేమను గుర్తింపవా ||పాపి||
1
ఆశలు నిండిన-లోకమునందు
ఆశలు ఎన్నో వుండునుగా
అవి-నాశనమునకే నడుపునుగా
ఆశలు త్రెంచి-ప్రేమను పెంచి
ప్రభుని పథమున నడువుమా... ప్రియుడా
2
విన్న బోధ యిది-నాకు కాదుయని
నిర్లక్ష్యముగా వెడలెదవా!
నీవు మారు మనస్సు పొందవా
రేపు యనెడి రోజున యందు
మరణము సంధించగా-మోక్ష
మార్గము ఇక లేదుగా... ప్రియుడా ||పా||
3
పాపము వలన శాపము కల్గెను
శాపము వలన మరణము కల్గెను
మరణపు ముల్లును విరచిన యేసు
పాపివైన నీ కోసరమే
పాపినైన నా కోసరమే
ప్రభువు సిలువ నొందెనుగా... ప్రియుడా
4
లోకము నీది కాదని తెలుసు
తెలిసిన నీవు తెలియకుందువా
విడుదల లేని-జీవితమునకు వేదన
కలదోయీ నరక
వేదన కలదోయీ ...ప్రియుడా ||పా||
5
నీదు జీవితము స్థిరము కాదుయని
యాత్రికుడవని మరచిపోతివా
నీదు గమ్యము ఏదో తెలుసా
తెలియకపోయినచో నీకు
నరకము తప్పదుగా... ప్రియుడా ||పా||

OK