AG 230 తలుపులు తీయండి యేసుకు
Versi Version 1
తలుపులు తీయండి యేసుకు
తలుపులు తీయండి
హృదయమనే కోవెల తలుపులు
యేసుకు తీయండి
ప్రభు యేసుకు తీయండి ||తలు||
1
దేహము దేవుని ఆలయము
అది దేవుడు మలచిన మందిరము
దేహమనే ఆలయమందు
దేవుని నిలుపండి
యేసు దేవుని నిలుపండి ||తలు||
2
గుమ్మముల్‌ తెరవండి
ఆలయ గుమ్మముల్‌ తెరవండి
గుమ్మముల్‌ తెరచి గంభీరముగా
గీతముల్‌ పాడండి
స్తుతి గీతముల్‌ పాడండి ||తలు||
3
మోకరించండి-అందరు మోకరించండి
మోకరించి మరియా సుతునికి
ప్రార్థన చెయ్యండి
ప్రభువా అని వేడండి ||తలు||

OK