AG 234 యేసు క్రీస్తు దొరికెనేని
Versi Version 1
యేసు క్రీస్తు దొరికెనేని
యేమి కొదువింకేమి భయము
దోసకారి జనుల కెంతోఁ
గ్రాసమవు నా యేసు పేరు ||యేసు||
1
తల్లిదండ్రుల కన్న చాలాఁ
దన ప్రేమ మన మీద
నెల్లకాల మందు నుంచు
యేసుఁడే మా తండ్రి యౌను ||యేసు||
2
వల్లగాని వశములేని
యెల్ల మేళ్ళన్నిటి నెల్లపుడు
కొల్లగా మన కిచ్చెడి దేవ
కొమరుఁడే వేరెవరు లేరు ||యేసు||
3
దండియైన గండములు
మెండుగాను మముఁజుట్టిన
తండ్రివలె మా దరికి వచ్చి
గండములను గదిమిఁ బ్రోచున్‌ ||యేసు||
4
సత్యము మార్గము తానె
నిత్య జీవ మింకా తానే
భృత్యుల మన కీయ మోక్షము
భువిని రక్తమంత గార్చె ||యేసు||
5
ఎన్నరాని పాపాత్ముల
కన్నులారా కనికరించి
పున్నెమైన తన ప్రాణము
భువిని బలి పెట్టినాఁడు ||యేసు||
6
ఒడలు నిండా గాయములతో
నడరుచుండ మరల లేచి
వెడలి పరమందునుండి
వేడుకలు మా కంపినాఁడు ||యేసు||
7
ఆశతోడ ఁదన్ను నమ్ము
యాత్మలకు దర్శన మిచ్చెడి
యేసుతో నింకెవరు సాటి
లేశమైనా లేరు సుండీ ||యేసు||

OK