AG 236 క్రైస్తవ సంఘమ క్రీస్తు జనమా
Versi Version 1
క్రైస్తవ సంఘమ క్రీస్తు జనమా
క్రీస్తును కనుగొనుమా
క్రీస్తును మీ రాజుగ నభిషేకిం
చుట కిదె తరుణంబు
క్రీస్తుకొరకు సాక్ష్యంబులివ్వ
సేవింతము లెండి-రండీ నేడే
క్రీస్తుడు మనలను కొనెను గావున
క్రీస్తుని వారముగా
క్రీస్తుకొరకు పరిమళవాసనగా
జీవింతములెండీ
1
ఇల మీ దేహంబులు మన దేవుని
కాలయములు గావా
వెలయిచ్చెను మనకై కలువరిపై
విలువగల రక్తముతోన్‌
కలుషజాలమును పారద్రోలిన
ప్రభువును - జేరగను - రండీ నేడే
గొనుమిదె రక్షణ భాగ్యము మనకై
దెచ్చెను మన ప్రభువే
యేసుక్రీస్తు పాదార విందములు
సేవింతము లెండీ ||క్రైస్తవ||
2
దేవుని వాక్యము మీ హృదయములలో
నివసింపగ నిండు
దేవుని పిల్లలుగా జీవించుట
భాగ్యంబే గదా
దైవభక్తిగలిగి నడచుట యిల
ధన్యతయే గదా మనకు నిరతం
పుణ్యుని ప్రాయశ్చిత్తపు బలియె
ప్రవిమలులుగ జేయున్‌
పుణ్యుడేసు పరిశుద్ధుని రక్తము
పావనులుగ జేయున్‌ ||క్రైస్తవ||
3
ప్రభు రాజ్య వ్యాప్తికి కారణ సా
ధనములు గనరండి
ప్రభు సామ్రాజ్యము మన మధ్యనే
స్థాపింపగ బూనండి
ప్రభువుల ప్రభువునకు ప్రభుడేసునకే
మహిమలు చెల్లింపన్‌
లెండి రండీ-
ప్రభునకు స్తుతి యాగము నర్పించుట
మన విధియె కాదా
స్తోత్రపాత్రుడౌ-యేసు ప్రభునకే
గీతము పాడండీ ||క్రైస్తవ||

OK