AG 237 మన పాపము మన శాపము
Versi Version 1
మన పాపము మన శాపము
యేసు సిలువలో మోసెను
కల్వరి సిలువలో
సాతాను సైన్యమున్‌-కూల్చివేసెను
1
యేసు రక్తములో
ముద్రించిన వారు
బూర వూదగానే
లోక పునాదులు వణికెన్‌ ||మన||
2
విజయము పొందిన రాజు
సైన్యముల ముందు నిలచే
భయమేల మనకు
జయము మనదే నిత్యం ||మన||
3
సకల వాద్యములతో
ఆయన జయమును పాడి
సంతోష గానములతో
పరిశుద్ధుల మధ్య నిలచి ||మన||
4
శత్రు సమూహములను
ఎఱ్ఱ సముద్రములోన
ముంచి వేయబడగా
శత్రుక్రియ లికలేవు ||మన||
5
జయము జయము జయము
ఎల్లవేళల జయము
యేసు నామమునకే
ఎల్లవేళల జయము ||మన||

OK