AG 238 యేసన్న స్వరమన్నా
Versi Version 1
యేసన్న స్వరమన్నా
నీవెపుడైనా విన్నావా ...ఆ ...ఆ
1
జనముల శబ్ధము, జలముల శబ్ధము
బలమైన ఉరుములతో
కలిసిన స్వరము, పిలిచిన యేసు
పిలిచిన పిలుపును నీవింటివా ||యే||
2
ఏదేను తోటలో ఆదాము చెడగా
ఆ దేవుడే పిలిచే
యెహోవా యెదుటను ఆదాము దాగెను
అటులనే నీవును దాగెదవా ||యే||
3
పనులను వదలి, జనులను విడిచి
నను కనుగొనుమనగా
కనిపెట్టి నందునఘనుడ బ్రాహాముకు
కనిపించె మనకన్న తండ్రి యేసే ||యే||
4
ఆనాడు దేవుడు మోషేను పిలువగ
ఆలకించెను స్వరము
ఈనాడు నీవును ఈ స్వరము వినగ
కానాను చేరగ కదలిరావా ||యే||
5
ఆ రీతిగానే సమూయేలు వినగా
ఆశీర్వాదమరసె
ధారాళముగను పరమ వరుని
దరిజేరుకొని నీవు సేవించుమా ||యే||
6
సౌలా, సౌలా నన్నేల హింసింతువు
చాలించు మనె స్వరము
సౌలాధిపునంత సంధించగానే
సద్భక్తుడై పౌలుగా మారెగా ||యే||
7
స్వరమును వినగా పరమార్థ జ్ఞాని
స్థిరుడైన యోహాను
పరమ మర్మాలు, భవిష్యద్విషయాలు
ప్రకటించె ప్రతిరోజు స్మరించుమా ||యే||

OK