AG 239 1. వార్తలలో యేసు సువార్త
Versi Version 1
1
వార్తలలో యేసు సువార్త
నరుల విమోచన శుభవార్త
శరణార్థుల ఆశ్రయవార్త
ధరణిని వెలసిన ఘన వార్త
నిరుపమ రక్షణ మార్గముగా
మర్మము దెలిపిన జ్ఞానముగా
కర్మను బాపు క్షమాపణగా
ధర్మమునంతటిన్‌ నెరవేర్చి
తరతరములు బ్రోచు సువార్త
2
జగతినిగాయు ప్రజాపతిగా
నిగమముజాటిన యాగముగా
విగతుల ప్రార్థన తుదిగతిగా
యుగముల నోముల బహుమతిగా
ఆగ్రహుడౌ ప్రభున్‌ శాంతింప
ఉగ్రతపాత్రను త్రాగుటచే
అగణిత రుధిర ప్రవాహములో
భగవంతుని కృప ప్రసరించి
భక్తులగను సిలువ సువార్త ||వార్త||
3
పాపికి బదులుగా మరణించి
శాపఋణములను చెల్లించెన్‌
అపవాదిని ఓడించుటచే
అపరాజితునిగా మృతిగెల్చెన్‌
రిపులను వారసులుగ చేసి
ఆప్తునిగా విలసిల్లుటచే
ఉపవాదిగ దేవుని యెదుట
తపనగ విజ్ఞాపన చేయు
సఫలీకృత సిలువ సువార్త ||వార్త||
4
ధర జీవితమున అభయములు
పరమార్థములో విజయములు
స్వర్గములో చిర సౌఖ్యములు
పరమాత్ముని స్తోత్రార్పణలు
మరియ సుతుని పునరాగమము
అరయుచు ప్రియులతో మురియుటయు
పరిశుద్ధుల సహవాసమును
వరుడగు యేసుని పరిణయము
పరిపూర్ణము చేయు సువార్త ||వార్త||

OK