AG 24 1 స్తుతించి పాడను పాత్రమైన
Versi Version 1
1
స్తుతించి పాడను పాత్రమైన
పావన యేసుని నామమదే
స్తుతుల మధ్యలోన వాసంచేయు
పవిత్రుని భక్తితో స్తోత్రింతుము
ఆ..అద్భుతమే - ఆ...నడుపుదల
ఆనందమే పరమానందమే
కృతజ్ఞ-స్తుతితో యెద పొంగుచుండె
మనం హల్లెలూయా స్తుతి చాటెదము
2
గతించినట్టి కాలమెల్లన్‌
కంటి పాపగ మము కాపాడెన్‌
ప్రభువు నే నమ్మి జీవించగా
కృపను చూపెన్‌ స్తోత్రింతుము
3
అగ్ని మధ్యను నడచినను
లోతైన జలమును దాటినను
శోధనలు ఎన్నో పెరిగినను
జయం మనదేయని స్తోత్రింతుము
4
ఈ అరణ్య యాత్రలో
మంచి యేసు మనతో నుండును
మన రాకపోకలయందును
కాచును గావున స్తోత్రింతుము

OK