AG 241 మా యేసుక్రీస్తుని-మఱుఁగు గల్గెనురా
Versi Version 1
మా యేసుక్రీస్తుని-మఱుఁగు గల్గెనురా
నా యాత్మ ఘన రక్షా నగము నెక్కెనురా
1
ముందు నాలో పాప-ములు
జూడబడెరా డెందము తానన్ని
టిని నొప్పుకొనెరా-యందుకై
బలుదుఃఖమాత్మఁజెందెనురా
సందేహములు వీడు-జాడఁగన్గొనెరా
2
సువిశేష బోధనా-చెవులాలించెనురా
అవివేక శాస్త్రోక్తు-లంటు వీడెనురా
నవసత్క్రైస్తవ గోష్ఠి-భువి నా కబ్బెనురా
వివిధములగు వేల్పు-ల్విషమైరిగదరా
3
బాధగురువుల మోము-ల్బహు
లజ్జఁబడెరా-గాధ మంత్రములన్ని
కడగండ్లయి చెడెరా-శోధించి
నా యాత్మ-శుద్ధి గోరెనురా-సాధించి
ప్రభు క్రీస్తు-శరణఁజొచ్చెనురా
4
మతిలోని లోఁతు మ-ర్మము గానబడెరా
మితిలేని ఘన-మే నిండు కొనెరా
హితముగా తన జీవ-మిచ్చెక్రీస్తుఁడురా
మృతి చేత మన పాప వితతి గొట్టెనురా
5
కులగోత్రముల బుద్ధి
కుటిలంబుఁదెగెరా
బలవత్పిశాచశృంఖలము విఱిగెనురా
సిలువ మోసినవాని -చిర సౌఖ్యోన్నతిరా
నెలవుగ నాలోన-నిలచియున్నదిరా
6
తనపోల్కెనొరులఁగన్గొనబ్రేమయ్యెనురా
మనసు దేవునికి న-ర్పణ సేయఁబడెరా
ఘన కృపశాంతులు-గొనెను నెమ్మదిరా
మనసు మార్పడి మోక్ష
మహిమ గన్గొనెరా

OK