AG 245 యేసుని స్వీకరించు
Versi Version 1
యేసుని స్వీకరించు
క్రీస్తేసుని స్వీకరించు
నీ హృదయపు ద్వారము తెరువుము
త్వరితము తానే ప్రవేశించును
1
కనికరముగల దేవుండు
నిను వాత్సల్యముతో విమోచించును
భయంకరమైన పాపము నుండి
విడిపింపనిన్ను వెదకివచ్చె ||యేసు||
2
మన్నించు సర్వ పాపములన్‌
తానే మాన్పును సర్వరోగములన్‌
కృపకనికరముల మకుటము నీకు
ధరియింపజేసి ఘనపరచున్‌ ||యేసు||
3
అంధులకు దృష్టి కలుగజేసే
అంగహీనులను లేపి నడువజేసెన్‌
పలువిధములగు వ్యాధి గ్రస్తులకు
స్వస్థత నిచ్చెను తక్షణమే ||యేసు||
4
పాపపు భారము భరియించెన్‌
నీ రోగములన్నిటి తొలగించన్‌
సహించెను కొరడా దెబ్బల బాధను
జయించెను అన్ని శోధనలన్‌ ||యేసు||
5
కలువరి సిలువలో వ్రేలాడి
తన రక్తము చిందించె ధారలుగా
చేతులలో తన కాళ్లలో చీలలు
ముండ్ల కిరీటము ధరియించె ||యేసు||
6
జీవమిచ్చుటకు ప్రాణమిడె
మరి జయించెను ప్రతి విధ శోధనలు
నీ కొరకై మరణించి లేచెను
శక్తిమంతుడై నిను రక్షింప ||యేసు||

OK