AG 248 ఇదిగో నేనొక-నూతన క్రియను
Versi Version 1
ఇదిగో నేనొక-నూతన క్రియను
చేయుచున్నాను
ఈనాడే అది మొలచును దాని
నాలోచింపరా
1
అడవిలో త్రోవను జేసి
ఎడారిలో నదులను నేను
ఎల్లప్పుడు సమృద్ధిగా
వ్రవహింప జేసెదను ||ఇదిగో||
2
నాదు ప్రజలు త్రాగుటకు
నే నరణ్యములో నదులు
సమృద్ధిగా పారునట్లు
సృషించెదను నేను
3
అరణ్యములో జంతువులు
కృార పక్షులు సర్పములు
ఘనపరచును స్తుతియించును
దీని నాలోచించుడి ||ఇదిగో||
4
నూతన సృష్టిగ నినుజేసి
నీ శాంతిని నదివలెజేసి
నను జూచి మహిమ పరచి
స్తుతి పాడ జేసెదను ||ఇదిగో||
5
నేనే దేవుడనని దెలసి
నా కార్యములను నెరవేర్చి
ముందున్న వాటికన్న ఘన
కార్యములను జేతున్‌ ||ఇదిగో||
6
మరుగైన మన్నానిచ్చి
మరి తెల్లని రాతినిచ్చి
చెక్కెదనా రాతిమీద నొక
క్రొత్త నామమును ||ఇదిగో||
7
పరలోక భాగ్యంబులు
నరలోకములో మన కొసగెన్‌
కరుణా సంపన్నుండగు
మన ప్రభునకు హల్లెలూయా ||ఇదిగో||

OK