AG 250 నా పేరే తెలియని ప్రజలు
Versi Version 1
నా పేరే తెలియని ప్రజలు
ఎందరొ వున్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప
కొందరె వున్నారు
ఎవరైనా మీలో ఎవరైనా
ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా
నా ప్రేమను చెబుతారా ||నా||
1
నేను నమ్మిన వారిలో
కొందరు మోసం చేశారు
వెళతామని చెప్పి
వెనుకకు తిరిగారు
మీరైనా-మీలో ఒకరైనా
వెళతారా-నా ప్రేమను చెబుతారా ||నా||
2
రక్షణ పొందని ప్రజలు
లక్షల కొలదిగా వున్నారు
మారు మూల గ్రామాలలో
ఊరి లోపలి వీధుల్లో
ఎవరైనా-మీలో-ఎవరైనా
వెళతారా నా ప్రేమను చెబుతారా ||నా||
3
వెళ్ళ గలిగితే మీరు
తప్పక వెళ్ళండి
వెళ్ళలేక పోతే
వెళ్ళే వారిని పంపండి
ఎవరైనా-మీలో-ఒకరైనా
వెళతారా-నా ప్రేమను చెబుతారా ||నా||

Share

OK