AG 256 ఇది ప్రజ్వరిల్లుచున్న-ఉజ్జీవ జ్వాల
Versi Version 1
ఇది ప్రజ్వరిల్లుచున్న-ఉజ్జీవ జ్వాల
ప్రభుయేసు సిలువ నుండి
ప్రవహించుధార
పవిత్రమై-పరిశుద్ధమై
ప్రవహించు జీవధార
1
మౌన ప్రార్థన-మోకాటి ప్రార్థన
కన్నీటి ప్రార్థన-ఉపవాస ప్రార్థన
సిలువ శక్తితో-విలువైన భక్తితో
సిలువ సాక్షిగా-శ్రీయేసు సాక్షిగా ||ఇది||
2
విశ్వాసఘాతకుల్‌-విద్రోహ చర్యలు
విచిత్ర మనుజుల-విషమైన మనసులు
సాతాను యుక్తులు-సహించి నేటికి
సాగిపోతుంది-సజీవసాక్షిగా ||ఇది||
3
ఎల్లలు దాటింది శ్రీ యేసు సువార్త
ఎంత ప్రయాణం-ఎంతెంత దూరము
ఎన్ని మేలులు-ఎన్నెన్ని దీవెనల్‌
పొందినవారంతా-దీవించబడితిరి ||ఇది||
4
లేచి తేజరిల్లింది ప్రభు సహవాసం
ఒంటరి వాడయ్యాడు వేలమందిగా
ఎండిన భూమిపై జీవజలములు
దప్పిక గలవారిపై కుమ్మరించాడు ||ఇది||

Share

OK