AG 265 ఓ మానవుడా-పాపమనే విషమున్నది
Versi Version 1
ఓ మానవుడా-పాపమనే విషమున్నది
యీ లోకములో
యేసు మాట వినరమ్ము మానవుడా
1
రాజును రారాజునని విఱ్ఱవీగకు
ఈ లోక వైభవములు ఒక్క నాటికే
ప్రతి మనిషి ఒకనాడు చనిపోవలెను
నీ క్రియలను బట్టియే
నీకు ప్రతిఫలము ||ఓ||
2
అందము నాకున్నదని ఆర్భటించకూ
నీ వయస్సు నడిప్రాయము వాడిపోవును
నీవేమి చేయుచూ-తిరుగుచుంటివో
నీ క్రియలను బట్టియే
నీకు ప్రతిఫలము ||ఓ||
3
ధనము ధనము ధనమని
ధనములో పడిపోకుము
ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం
ధనవంతుడు పరలోక రాజ్యములో
ప్రవేశించుట ఎంతో-దుర్లభము ||ఓ||

OK