AG 270 గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ
Versi Version 1
గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండీ
1
సర్వాధికారియు-సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి
మనముత్సహించెదము ||గొఱ్ఱె||
2
సిద్ధపడెను వధువు-సుప్రకాశముగల
నిర్మల వస్త్రములతో
నలంకరించుకొనెన్‌ ||గొఱ్ఱె||
3
పరిశుద్ధుల నీతి-క్రియలే యా వస్త్రములు
గొఱ్ఱెపిల్ల రక్తములో
శుద్ధినొందినవారు ||గొఱ్ఱె||
4
తెల్లని గుఱ్ఱముపై-కూర్చుండినవాడు
నమ్మకమైయున్నట్టి
పెండ్లి కుమారుడు ||గొఱ్ఱె||
5
దేవుని వాక్యమను-నామము గలవాడు
రక్తములో ముంచిన
వస్త్రమున్‌ ధరియించె ||గొఱ్ఱె||
6
పరలోక సేనలు-తెల్ల వస్త్రములతో
తెల్ల గుఱ్ఱముల నెక్కి
వెంబడింతురు ప్రభుని ||గొఱ్ఱె||
7
ప్రేమించి సంఘముకై
ప్రాణంబు నిడె ప్రభువు
పరిశుద్ధ పరచుటకై
తానప్పగించుకొనెన్‌ ||గొఱ్ఱె||
8
శ్రీ యేసు క్రీస్తుండె
సంఘమునకు శిరస్సు
వాక్య ఉదకముతోడ
శుద్ధి పరచుచుండె ||గొఱ్ఱె||
9
యెహోవ రాజ్యములో
భూలోకవాసులు
సంతోష హృదయములతో
తేజరిల్లెదరు ||గొఱ్ఱె||
Versi Version 2
1
దేవా! యీ కార్యములు
నెరవేర్చితివి నీవె
నిత్యమును నీ మహిమ
పాడెద హల్లెలూయ ||గొఱ్ఱె||

OK