AG 274 శ్రీ యేసుండు జన్మించె రేయిలో
Versi Version 1
శ్రీ యేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బెత్లెహేమ యూరిలో
1
కన్నియ మరియమ్మ-గర్భమందున
నిమ్మానుయేలనెడి-నామమందున||శ్రీ||
2
సత్రమందున బశువుల-సాలయందున
దేవపుత్రుండు-మనుజుండాయె నందున
3
పట్టి పొత్తి గుడ్డలతో-జుట్టబడి
పశుల తొట్టిలో-బరుండ బెట్టబడి ||శ్రీ||
4
గొల్లలెల్లరు-మిగుల భీతిల్లగ
దెల్పె గొప్ప-వార్త దూత చల్లగ ||శ్రీ||
5
మన కొరకొక్క-శిశువు పుట్టెను
ధరను మన దో-షముల బోగొట్టను
6
పరలోకపు-సైన్యంబు గూడెను
మింట వర రక్ష-కుని గూర్చి పాడెను
7
అక్షయుండగు-యేసు వచ్చెను
మనకు రక్షణంబు సిద్ధ పర్చెను ||శ్రీ||

OK