AG 275 వినరే యో నరులారా
Versi Version 1
వినరే యో నరులారా
వీనుల కింపుమీర
మనల రక్షింప క్రీస్తు
మనుజావతారుఁడయ్యె వినరే
అనుదినమును దేవుని తనయుని పద
వనజంబులు మన
మున నిడికొనుచును ||వినరే||
1
నరరూపు ఁబూని ఘోర
నరకుల రారమ్మని
దురితముఁ బాపు దొడ్డ
దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరుదగు క-ల్వరి
గిరి దరి కరి-గి రయంబున ప్రభు
కరుణను గనరే ||వినరే||
2
ఆనందమైన మోక్ష
మందరి కియ్య దీక్ష
బూని తనమేని సిలువ
మ్రాను నణఁచి మృతి బొందెను
దీనదయాపరుఁడైన
మహాత్ముఁడు జానుగ
యాగము సలిపిన తెరంగిది ||వినరే||
3
పొందు గోరిన వారి
విందా పరమోపకారి
యెంద రెందరి బరమా
నంద పద మొందగ జేసెను
అందమునన్‌ దన
బొంది సురక్తము జిందెను భక్తుల
డెందము గుందఁగ ||వినరే||
4
ఇల మాయావాదుల మాని
ఇతడే సద్గురు డని
తలపోసి చూచి మతి
ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలుముల నలరెడు
ధని-కుల కందని సుఖ-ములు
మరి యొసగును ||వినరే||
5
దురితము లణఁప వచ్చి
మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద
సు-ందర మందిరమున కరుదుగ జనె
బిరబిరమన మం-దర మా
కరుణా-శరనిధి చరణమె
శరణని పోదము ||వినరే||

OK