AG 278 సంతోషించుడి-యందరు నాతో
Versi Version 1
సంతోషించుడి-యందరు నాతో
సంతోషించుడి
యొక- వింతయగు కీర్తనఁ
బాడ వచ్చితిని-సంతోషించుడి-నాతో
1
అంధకార మయమైన భూమి
నా-ద్యంతము వెలిగింప
దాని యావేశము దొలగింప
వందితుండు క్రీస్తేసు
నాథుడు వచ్చె బ్రకాశుండై
భూమికి-నిచ్చె ప్రకాశంబు ||సంతో||
2
కాన నంధకారంబు దొలగఁ
ప్రకాశించెను లెండు
మీరు ప్రకాశింపను రండు
మానవులనుసంతోషపర్చనై
మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె ||సంతో||
3
మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె
హృదయ ములఁదగుల ప్రకాశించె
మున్ను జేయఁబడిన
వాగ్దత్తము తిన్నగ నెరవేరె
భక్తుల కన్నులాశ దీరె ||సంతో||
4
ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను
గలసికొని-నాతో పాడుచును
నీ తరిదూరస్థుల కీ వార్తను
నే తీరున నైనఁ-దెలుపగ
నాతురపడవలెను ||సంతో||
5
పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను
లోకమున జూపింపగ వలెను
జూపకపోయిన లోపము మనపై
మోపబడును నిజము వేగము
జూపుదమాపథము ||సంతో||

OK