AG 283 మనకై యేసు-మరణించె
Versi Version 1
మనకై యేసు-మరణించె
మన పాపముల కొరకే
నిత్య జీవము నిచ్చుటకే
సత్యుండు సజీవుడాయె
1
తృణీకరింపబడె
విసర్జింపబడెను
దుఃఖాక్రాంతుడాయె
వ్యసనముల భరించెను ||మనకై||
2
మన వ్యసనముల వహించెన్‌
మన దుఃఖముల భరించెన్‌
మన మెన్నిక చేయకయే
మన ముఖముల ద్రిప్పితిమి ||మనకై||
3
మన యతిక్రమముల కొరకు
మన దోషముల కొరకు
మన నాథుడు శిక్ష నొందె
మనకు స్వస్థత కలిగె ||మనకై||
4
గొఱ్ఱెలవలె తప్పితిమి
పరుగిడితిమి మన దారిన్‌
అరుదెంచె కాపరియై
అర్పించె ప్రాణమును ||మనకై||
5
దౌర్జన్యము నొందెను
బాధింపబడెను
తన నోరు తెరువలేదు
మనకై క్రయధన మీయన్‌ ||మనకై||
6
ఎదిరింప లేదెవరిన్‌
లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్‌
మహా వ్యాధిని కలిగించెన్‌ ||మనకై||
7
సిలువలో వ్రేలాడెన్‌
సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్‌
స్తోత్రము హల్లెలూయ ||మనకై||

OK