AG 284 సిలువలో బలియైన
Versi Version 1
సిలువలో బలియైన
దేవుని గొఱ్ఱెపిల్ల
విలువైన నీ ప్రేమన్‌
వివరింతు శ్రీ యేసు
1
ఆనాటి యూదులే
నిను జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో
నా పాప ఋణమునకే ||సిలువ||
2
నాయతి క్రమములకై
నలుగ గొట్టబడి
నా దోషముల నీవు
ప్రియముగను మోసితివా ||సిలువ||
3
మృదువైన నీ నుదురు
ముండ్ల పోట్లచేత
సురూపమును లేక
సోలిపోతివా ప్రియుడా ||సిలువ||
4
నా రోగములు నీపై
నమ్రతతో భరియించి
తృణీకరింపబడి
ప్రాణమర్పించితివి ||సిలువ||
5
వ్యసనా క్రాంతుడవుగా
వ్యాధి ననుభవించి
మౌనము ధరించి
మరణమైతివా ప్రభువా ||సిలువ||
6
నా పాప దోషముచే
నేచచ్చి యుండగనే
మరణమై నా కొరకు
మరి తిరిగి లేచితివి ||సిలువ||
7
పరమున కెత్తబడిన
ప్రియ యేసు రాకడకై
పదిలముగ కనిపెట్టి
పాడెదను హల్లెలూయ ||సిలువ||

Share

OK