AG 297 ఎంతో వింత యెంతో చింత
Versi Version 1
ఎంతో వింత యెంతో చింత
యేసునాథు మరణమంత
పంతముతో జేసి రంత
సొంత ప్రజలు స్వామి నంత ||ఎంతో||
1
పట్టి కట్టి నెట్టి కొట్టి
తిట్టి రేసు నాథు నకటా
అట్టి శ్రమల నొంది పలుక
డాయె యేసు స్వామి నాడు ||ఎంతో||
2
మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపు పైని
మొయ్యలేక మ్రాని తోడ
మూర్ఛబోయె నేసు తండ్రి ||ఎంతో||
3
కొయ్యపై నేసయ్యన్‌ బెట్టి
కాలు సేతులలో జీలల్‌
కఠినులంత గూడి కొట్టిరి
ఘోరముగ క్రీస్తే సున్‌ బట్టి ||ఎంతో||
4
దాహముగొన జేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహులకటా
ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా ||ఎంతో||
5
బల్లెముతో బ్రక్కన్‌ బొడవన్‌
పారె నీరు రక్త మహహా
ఏరై పారె యేసు రక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు ||ఎంతో||

Share

OK